కమాన్పూర్ మే 16 : మంథని నియోజవకర్గానికి మళ్లీ వెలుగులు రా వాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆకాంక్షించారు. అది ప్రజాస్వామ్య పో రాటంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కమాన్పూర్ మండలం రొంపికుంటలో ప్రజాస్వామ్య పోరాటానికి శ్రీకారం చుట్టా రు. ముందుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, ఆలయంలో పూజలు చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం ప్రజాస్వామ్య పోరాట లోగోను ఆవిషరించారు. తండ్రి తర్వాత తమ్ముడు, కొడుకు ఇలా వారసులవ్వడం కాదని, ఈ మట్టిలో పుట్టిన బిడ్డను ఎమ్మెల్యే చేయాలన్నదే ఈ ప్రజాస్వామ్య పోరాట లక్ష్యమని చెప్పారు. రొంపికుంటలో ఎంతో మంది చైతన్యవంతులు ఉన్నారని, ఇకడి నుంచే చైతన్యం మొదలు కావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించకపోతే చీకటి పాలనను అంతం చేయలేమని తెలిపారు. నలభై ఏండ్లుగా ఒకే కుటుంబానికి ఓట్లు వేసి అవకాశం ఇస్తే ఏం చేశారో ఆలోచన చేయాలని సూచించారు. సమీపంలోనే ఉన్నా రొంపికుంట గ్రామానికే మేలు జరగకపోతే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, అగ్రవర్ణాల్లోని పేదలకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఆలోచన చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే తమపై అక్రమ కేసులు పెట్టారని, మహాముత్తారం, రామగిరి, మంథని, కమాన్ పూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, మరికొందరు నాయకులపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని మండిపడ్డారు.
పదేళ్ల కాలంలో తాము ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని, ఎవరు ధర్నా చేసినా ఆందోళనలు చేసినా కేసులు పెట్టించలేదన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు పని చేయడం లేదని, గోదావరిఖని ఏసీపీ కార్యాలయం నుంచే నడుస్తున్నాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేపై కేసులు పెట్టేందుకే ఇకడ పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడితే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే పోలీస్స్టేషన్లకు కాంగ్రెస్ కార్యాలయాలని బోర్డులు పెట్టాల్సి వస్తుందని, ఆ పరిస్థితిని తీసుకురావద్దని హితవుపలికారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే మంథని ఎమ్మెల్యే ఏ ఒక పథకంలో మార్పు తీసుకురాలేదని, ఆనాడు చెప్పివన్నీ అధికారం కోసం ఆడిన అబద్ధాలేనని మండిపడ్డారు. శ్రీపాద ట్రస్టు ద్వారా పేదలకు ఎందుకు సేవలు చేయడం లేదని, కాటారంలో ఓ ఎస్సీ బిడ్డ మెడిసిన్ సీటుకు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నానని మొరపెట్టుకున్నా ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. మంథని ఎమ్మెల్యే ఊకదంపుడు మాటలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.