Tractor Owners Association | ముత్తారం, మే 24: మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ రామాంజనేయ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్, ఉపాధ్యక్షుడిగా శేరు రాజేశం, ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ, సహాయ కార్యదర్శిగా సోమిడి ప్రభాకర్, కోశాధికారిగా తోడేటి రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యవర్గ సభ్యులుగా మర్రి శ్రీకాంత్, సందెల శ్రీనివాస్, పునగుర్తి గట్టయ్య, బుడిమే కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ట్రాక్టర్ యూనియన్ బలోపేతం కోసం కృషి చేస్తామని, యూనియన్ అభివృద్ధే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు, రైతులు పాల్గొన్నారు.