Jeevan Reddy | గీత కార్మికులకు సబ్సిడీతో జీవన ఆధారం కల్పించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Jeevan Reddy | ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గీత కార్మికులకు ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యాలు ఇచ్చి జీవన ఆధారం కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు.
సారంగపూర్ : ప్రమాదకరమైన వృత్తిలో ఉన్న గీత కార్మికులకు ( Toddy Tappers ) ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యాలు ( Subsidi ) ఇచ్చి జీవన ఆధారం కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) కోరారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం లచ్చక్క పేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట, పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు ,దీవెనలు గీత కార్మికుల పైన ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.అన్నింటి కన్నా ప్రమాదకరమైన వృత్తి గౌడ సోదరుల గీత వృత్తి అని,గీత కార్మికులకు ఈత వనానికి 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులతో గౌడ సోదరుల వృత్తికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం బెల్ట్ షాపులను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బెల్ట్ షాపులను ఎత్తివేయాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

