BRS | పాలకుర్తి : పాలకుర్తి మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం బసంత్ నగర్ టోల్ ప్లాజా, ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడమే ధ్యేయంగా పాలకుర్తి మండలం లోని బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద అలాగే ధర్మారం క్రాస్ రోడ్ వద్ద పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన నిర్వహించారు.
ఈ బంధు కార్యక్రమం విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు, బీసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి కిరణ్, కన్నాల మాజీ ఎంపీటీసీ ఎమ్మే అతీక్, రానాపూర్ మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీనివాస్, కన్నాల గ్రామ శాఖ అధ్యక్షుడు ఖాదర్ పాషా, నాయకులు ముత్యాల కనకయ్య, తాటిపాముల లక్ష్మయ్య, బుర్ర మధునయ్య గౌడ్, మేకల వెంకటస్వామి, ఈసారపు శివ, చందుపట్ల మధు కుమార్, బూర్ల శ్రీహరి, కన్నం నరసయ్య, తగరం సతీష్, అక్కపాక శ్రీకాంత్, భూ పెళ్లి సాగర్, కలువల సంతోష్, సాయికిరణ్, సముద్రాల మనోహర్, మామిడాల లక్ష్మణ్, దేవి శ్రవణ్, జంపాల రాకేష్, మాటూరి శశికుమార్, తోఫిక్, గొట్టి శ్రావణ్, కన్నం చింటూ, టౌసఫ్, గౌస్ పాషా, డేగల రాములు, మాటూరి శశి కుమార్ మరియు అధిక సంఖ్యలో బీసీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.