Dumping yard | కార్పొరేషన్ ఏప్రిల్ 3 : నగరంలోని డంపింగ్ యార్డ్ ను తొలగించాలని కోరుతూ వరసిద్ధి కాలనీ ప్రజలు శనివారం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డంప్ యార్డ్ హఠావో-కరీంనగర్ బచావో అనే నినాదంతో కోతిరాంపూర్, వరసిద్ధి నగర్ కాలనీ వాసులు కాలనీ నుండి స్వచ్ఛందంగా కోతి రాంపూర్ చౌరస్తా నుంచి డంప్ యార్డ్ వరకు శాశ్వతంగా పరిష్కారం కోసం మానవహరంగా బయలుదేరి అక్కడ మున్సిపాలిటీ చెత్త బండ్లను అడ్డుకొని నిరసన తెలిపారు.
ఇంతటితో ఆగకుండా మున్ముందు అఖిలపక్షంగా ఏర్పడి డంప్ యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం మా కార్యాచరణ తీవ్రరూపం దాల్చేవిధంగా మా కారిక్రమాలు వుంటాయని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.