Ganneruvaram | గన్నేరువరం, మే31: మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఏడు వారాలు గా కూలి డబ్బులు చెల్లిచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో పని చేసిన తర్వాత పది లేదా పదిహేను రోజులు కు కూలీ డబ్బులు వచ్చేవన్నారు. పని సమయంలో కనీసం వసతులు లేకున్నా పని చేశారని తెలిపారు. పలు గ్రామాలలో జాబ్ కార్డ్ డిలీట్ అవుతున్నాయని, సంబందిత అధికారులు కు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోయారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కూలీ డబ్బులు జమ చేయాలనీ డిమాండ్ చేశారు.
లేనిపక్షం లో కార్యాలయం ముట్టడి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, జిల్లా నాయకులు కాంతలా అంజిరెడ్డి, సహాయ కార్యదర్శులు పిప్పమండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ల కనుకయ్య, కూన మల్లయ్య, యువజన నాయకులు మొల్గురి ఆంజనేయులు, నాయకులు బోయిని తిరుపతి, బోయిని మల్లయ్య, దామా సంపత్, కూన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.