Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 12 : దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండలంలో సీఐటీయూ, బీఆర్టీయూ ట్రేడ్ యూనిట్స్ ఒక రోజు సమ్మె పిలుపులో భాగంగా మండలంలో ఆశా, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ, హమాలీ కార్మికులు మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయం వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు.
నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా 8 గంటలు పని దినాలు కాకుండా పెంచుతూ అడిగే హక్కు లేకుండా నష్టం కలిగిస్తుందని వాపోయారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉక్కు పాదం మోపే విధంగా వ్యవహరిస్తుందన్నారు.
నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేసేంతవరకు కార్మికుల ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మారేళ్ల శ్రీలత, అంగన్వాడీ నాయకురాలు విజయ,తిరుమల, పద్మ, ధనలక్ష్మి, పద్మ, పావని, ఆశ నాయకురాలు పద్మ, ప్రియాంక, కల్పన, అంజలి, సునీత, సరోజన, శ్వేత, పంచాయతీ కార్యదర్శి వర్కర్స్ నాయకురాలు సునీత, శాంత, రాధా, కార్తీక్, వెంకటస్వామి, అంకవ్వ, సరవ్వ తదితరులు పాల్గొన్నారు.