Fee reimbursement | పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 15 : పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు విద్యార్థుల ఫీజు రీయిబంర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడిలు తట్టుకోలేక అనేక ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానంటేనే బీటెక్ ఇంజనీరింగ్ కళాశాలల్లో జాయిన్ అయ్యామని, లేదంటే ఏదో చిన్న సదువులు సదువుకునే వారమని విద్యార్థులు వాపోయారు. అలాంటిది ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో నష్టపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అకౌంట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.