Vemulawada | వేములవాడ రూరల్, మార్చి 16 : వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాతరాజుపల్లి చెందిన గుడిసె అశోక్ అనే వ్యక్తి భార్య కాపురానికి రావడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. చాలా రోజుల నుండి భార్య కాపురానికి రావటం లేదని, రెండు రోజుల క్రితమే కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే సరైన సమాధానమివ్వడం లేదని తీవ్ర మనోవేదనకు గురైన అశోక్ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు.
గతంలో కూడా అశోక్ భూ సమస్య పరిష్కరించాలని ఇదే ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. మరోసారి వాటర్ ట్యాంక్ ఎక్కి నీరసన చెప్పటగా వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్‌తోపాటు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి అక్కడికి చేరుకుని అశోకుని వాటర్ ట్యాంక్ దిగాలని, సమస్య పరిష్కరిస్తామని ఫోన్లో చెప్పిన దిగిరాలేదు. దాదాపు రెండు గంటల పాటు ట్యాంక్ పైనే ఉన్నాడు. ట్యాకు దిగాలని డీఎస్పీ, కౌన్సిలర్లతో పాటు గ్రామస్తులు అశోక్‌తో చర్చలు జరుపుతున్నారు.