Thimmapur | తిమ్మాపూర్, మే 26 : అర్హులైన తనను కాదని ఇతరులకు ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ కుటుంబంతో కలిసి పంచాయతీ వద్ద నిరసన తెలిపింది. తనకు ఇందిరమ్మ ఇండ్లు ప్రవేశపెట్టినప్పటి నుండి తనపై వివక్ష చూపుతూ ఇల్లు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కుటుంబంతో కలిసి రాత్రి నుండి గ్రామపంచాయతీలోనే ఉంది. ఉదయం గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించగా తన ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు కావాలనే తనకు ఇల్లు ఇవ్వడం లేదని ఆరోపించింది. రెండో విడతలోనైనా కేటాయిస్టారని ఆశించానని.. ఇప్పుడు కూడా తన పేరు లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు తన గోడు విని ఇప్పుడైనా ఇల్లు ఇస్తారో లేదో చూడాలని బాధిత కుటుంబం పేర్కొంది.