Hindu Dharma | కోల్ సిటీ, ఆగస్టు 22: హిందూ ధర్మ పరిరక్షణకు మనమంతా పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం జాతీయ కన్వీనర్ ఆకారపు కేశవరాజు పిలుపునిచ్చారు. వీహెచ్‌పీ స్థాపించి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాత్రి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో వీహెచ్‌పీ స్థాపన దివస్ సభ నిర్వహించారు. ముందుగా వీహెచ్ పీ కార్యదర్శి అయోధ్య రవీందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ దేశంలో మత మార్పిడిలను అడ్డుకునే శక్తి వీహెచ్ పీ కి మాత్రమే ఉందన్నారు. జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను, హిందు కుటుంబాలను ముస్లింలుగా మారుస్తున్న హిందూ వ్యతిరేక శక్తులను అడ్డుకుంటున్నామన్నారు.
దేశంలోని సాధు సంతుల ప్రోత్భలంతో వీహెచ్‌పీని 1984లో స్థాపించడం జరిగిందనీ, ప్రపంచ హిందూ సమ్మేళనం పేరుతో గొప్ప విజయంగా ముందుకు సాగుతుందన్నారు. అయోధ్య రామాలయ కలను సాకారం చేసుకున్నామన్నారు. హిందూ ధర్మం కట్టుబొట్టు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం హిందువులను జాగృతం చేస్తున్నామన్నారు. ప్రతి బస్తీ, ప్రతి ఇంటింటి వరకు హిందూ సమాజంను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. యువత భజరంగ్ దళ్ లో చేరి హిందుత్వ రక్షణ ధ్యేయంగా పని చేయాలన్నారు.
కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం, కార్యదర్శి మునిగాల సంపత్, భజరంగ్ దళ్ జిల్లా సంయోజిక్ ముక్కె సంపత్, బండ సమ్మన్న, నేరేడుకొమ్మ వెంకటస్వామి, కొండపర్తి లింగన్న, తిరుపతి ములకుంట్ల శ్రీనివాస్, బండ రాజేశ్, జలందర్, లలితమ్మ, భవాని, కోట తిరుమల, సంధ్య, అంజయ్య, సురేందర్, అజయ్ కుమార్, రమేశ్, సంజయ్ కుమార్, మద్దెల శ్రీను, చక్రపాణి, నరేశ్, మనోహర్‌తోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.