గన్స్ స్వాధీనం!
రాష్ట్రంలోనే సంచలనం రేపిన కరీంనగరంలోని పీఎంజే జ్యువెల్లరీలో నగల దోపిడీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే దోపిడీకీ ప్లాన్ వేసిన సూత్రధారితో పాటు ఈ చోరీలో పాల్గొన్న ప్రధాన నాయకుడు, మరొకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.
- పీఎంజే జ్యువెల్లరీ నగల దోపిడీ కేసులో పురోగతి
- రోజుకో కొత్త విషయం వెలుగులోకి
- నేటితో సుబోధ్సింగ్, మరో ఇద్దరి పోలీస్ కస్టడీ ముగింపు
- మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు
కరీంనగర్ రాంనగర్, జూన్ 6: రాష్ట్రంలోనే సంచలనం రేపిన కరీంనగరంలోని పీఎంజే జ్యువెల్లరీలో నగల దోపిడీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే దోపిడీకీ ప్లాన్ వేసిన సూత్రధారితో పాటు ఈ చోరీలో పాల్గొన్న ప్రధాన నాయకుడు, మరొకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అయితే 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 వజ్రాభరణాలను ఎక్కడికి..? ఎవరి ద్వారా పంపించారు అనే విషయాలను రాబట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతిలో ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు.
విచారణ సమయం శనివారం ముగియడంతో ఆదివారం ఉదయం తిరిగి సుబోధ్సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవీష్కుమార్ను కరీంనగర్ జైలుకు తలించనున్నారు. నిందితులను కస్టడీకిలోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలోనే కరీంనగర్ పోలీసులు రెండు రోజుల కింద మరో దోపీడీ దొంగను బిహార్లో అరెస్ట్ట్ చేశారని, అతడిని సైతం కరీంనగర్కు తీసుకువస్తున్నట్టు తెలిసింది. అయితే దోపిడీ తర్వాత దొంగలు రామడుగు మండలం మీదుగా ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతం దాటి పారిపోగా, తుపాకుల విషయమై కస్టడీలో ఉన్న రఘునాథ్ కర్మాకర్, రవీష్లను పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
వెలిచాల ప్రాంతం వద్ద రెండు తుపాకులను భద్రపరిచి పారిపోయినట్టు తెలుపగా, పోలీసులు ఆయా పరిసర ప్రాంతాల్లో రెండు రోజులు పాటు గాలించి, రఘునాథ్ కర్మాకర్, రవీష్ వినియోగించిన రెండు గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. అయితే దోపిడీలో పాల్గొన్న మరో ఇద్దరి కోసం పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. మొత్తం 18 బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి. ఆదివారంతో దొంగల కస్టడీ ముగుస్తుండడంతో కోర్టు అనుమతితో మరో మారు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

