KalvaSrirampur | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్16 : క్షేత్ర స్థాయిలో అధికారులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలని మండల ప్రత్యేకాధికారి శ్రీమాల అన్నారు. ప్రజాపాలన-ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణపై కాల్వశ్రీరాంపూర్లో గురువారం మండల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు ఉంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రజలనుండి సూచనలు స్వీకరించి, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం అరైవ్-అలైవ్ కార్యక్రమంలో బాగంగా రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీవో రాంమోహనాచారి, ఎంఈవో మహేశ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, డాక్టర్లు మహేందర్, సురేశ్, ఏవో సంద్య, ఏపీఎం లవకుమార్, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, మండల స్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు.