Prize distribution | పాలకుర్తి, జూన్ 22: పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధ్యప్రదేశ్ ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం గత మూడు రోజులుగా జరిగిన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ కరీంనగర్ జట్టు, మేడారం ఐటిడిఏ జట్ల మధ్య జరగగా కరీంనగర్ జట్టుపై మేడారం ఐటిడిఏ జట్టు విజయం సాధించింది.
గెలుపొందిన మేడారం ఐటీడీఏ జట్టుకు రూ.50 వేల నగదు, షీల్డ్ ను, కరీంనగర్ జట్టుకు రూ.25వేలు, షీల్డ్ , కామారెడ్డి జట్టుకు రూ.10 వేలు, షీల్డ్, మంచిర్యాల జట్టుకు రూ.5వేలు, షీల్డ్ లను పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులు ప్రదానం చేశారు. పలువురు జానపద కళాకారులకు ఆలయ ఫౌండేషన్ 2025 జానపద కళాపురస్కారాలను అందజేశారు.
సంగీత విద్యావేత్త స్వర వీణపాణినీ ఘనంగా సన్మానించారు. ఆలయ ఫౌండేషన్ 2025 సరస్వతి పుత్ర బిరుదును హరి కథ కవిరాజు రుక్మభట్ల నర్సింహస్వామి కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ నరహరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వాలీబాల్ టోర్నమెంట్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, brs నాయకురాలు దాసరి ఉష, బీసీ నాయకులు వకుళాభరణం వకుళాభరణం కృష్ణమోహన్ రావు, నరహరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.