Electricity | ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్
యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడో రోజుకు చేరింది.
- కరీంనగర్లో ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఉద్యోగుల నిరసన
Electricity | ముకరంపుర, జులై 16 : యాదాద్రి పవర్ ప్లాంట్ లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడో రోజుకు చేరింది. విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు, విద్యుత్ ప్లాంట్లలో పనిచేసే ఉద్యోగులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడే ప్రభావంపై జేఏసీ నాయకులు ఉద్యోగులకు వివరించారు.
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, వెంకట్ నారాయణ, శ్రీమతి, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

