కరీంనగర్ కలెక్టరేట్, మే 8 : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన 6 నుంచి 14 ఏళ్లలోపు వయసు గల కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన అంధ బాల, బాలికలకు మాత్రమే ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఉచిత విద్యతో పాటు, పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాదరక్షలు, వసతి గృహ సౌకర్యం కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు సదరం, యూడీఐడీ అంధుల సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, టీసీ, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తును ప్రిన్సిపాల్, ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, మల్కాపూర్రోడ్, శాతవాహన వర్సిటీ ఎదురుగా, విజయపురి కాలనీ, కరీంనగర్లో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 9701 190127, 94403 38424 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.