Nutritious food | జగిత్యాల, సెప్టెంబర్ 20 : గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్ వైజర్ కే కవితా రాణి సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా జగిత్యాలలోని చిలుకవాడ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులతో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ కవితారాణి మాట్లాడుతూ రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ పండ్లు తీసుకోవాలన్నారు.
ప్రతీ రోజు భోజనంలో ఒక పూట చిరుధాన్యాలతో కూడిన భోజనం ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అభాకార్డు, అపార్ కార్డు జనరేట్ చేసి వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఏఎన్ఏం మాదేశి శిరీషా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులు రాకుండా నివారించవచ్చాన్నారు. రక్త హీనత వల్ల జరిగే నష్టాల గురించి ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సావిత్రి, ఆశ కార్యకర్త లావణ్య తదితరులు పాల్గొన్నారు.