Karimnagar | చిగురుమామిడి, అక్టోబర్ 26: చిగురుమామిడి మండలంలోని చిన్న ములకనూరు గ్రామానికి చెందిన బుర్ర ప్రవీణ్ కుమార్ ఈనెల 31 నుండి నవంబర్ 2 వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరుగనున్నాయి.
థైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 42వ జూనియర్ క్యూరిగీ, 15వ పూoసే జాతీయస్థాయి పోటీలకు కరీంనగర్ జిల్లా నుండి సీనియర్ థైక్వాండో కోచ్ బుర్ర ప్రవీణ్ కుమార్ ను టెక్నికల్ ఆఫీసర్ గా ఎంపీక చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీకి ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.