Prajavaani | చిగురుమామిడి, ఆగస్టు 24 : చిగురుమామిడి మండల పరిషత్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలో పలు గ్రామాల్లో పల్లె పల్లెకు ప్రజాపాలన పర్యటన చేపట్టడంతో ప్రజావాణి అధికారులు లేక వెలవెలబోయింది. మంత్రి కొండాపూర్, నవాబ్ పేట్, ఇందుర్తి, ఓగులాపూర్, గునుకుల పల్లె గ్రామాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో భాగంగా దరఖాస్తుదారులు నేరుగా జిల్లా అధికారుల ఎదుట మంత్రి గారికి దరఖాస్తులు ఇచ్చేందుకు మొగ్గుచూపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణికి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు.
వివిధ సమస్యలతో వినతిపత్రాలతో సందడిగా కనిపించే ప్రజావాణి ప్రాంగణం సోమవారం దరఖాస్తులు 13 వచ్చాయి. వివిధ గ్రామాల నుండి పెద్దగా హాజరు కాకపోవడంతో వేళ వేళ పోయింది. ప్రజావాణిలో డిప్యూటీ తహసీల్దార్ కళావతి, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ రజిత ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. మంత్రి పర్యటనలో భాగంగా సంబంధిత మండల శాఖ అధికారులు మంత్రి వెంటే ఉన్నారు. మంత్రి పర్యటన ఉన్న రోజున ప్రజావాణి మాత్రం కలతప్పిందని ప్రజావాణికి హాజరైన సిబ్బందిలో గుసగుసలు వినిపించాయి.