కమాన్ చౌరస్తా : డిగ్రీతోపాటు సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తి చేసిన కామర్స్ (Commerce )విద్యార్థులకు ప్రస్తుత వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అత్యున్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మస్కట్ లోని మ్యాజిస్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు చెందిన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ (సీఎంఏ) ప్రభాకర్ తెలిపారు. స్థానిక ఎస్ఆర్ఆర్ అటనామస్ కళాశాలలోని(SRR Autonomous College) కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. కామర్స్, బీబీఏ విద్యార్థులు డిగ్రీతోపాటు చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను అధ్యయనం చేయవచ్చన్నారు.
ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి భారతదేశంతో పాటు ఇతర దేశాలలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ ఆచార్య కే రామకృష్ణ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కామర్స్ విభాగాధిపతి టి రాజయ్య, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఎం. మల్లారెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, టీజీసీజీటీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, హర్జోత్ కౌర్, ఎం శ్రీనివాస్ రెడ్డి , డాక్టర్ ఆర్ రామకృష్ణ, డాక్టర్ డాక్టర్ బూర్ల నరేష్, డాక్టర్ కే అర్జున్, శిరీష, అరవింద్, నర్మద మల్లేశం, రాములు, రాజు, విద్య, పూర్ణచందర్ అభిలాష్, నాగరాజు, శిరీష, తదితరులు పాల్గొన్నారు.