Road work | తిమ్మాపూర్,ఆగస్టు13: ఇటీవల కురిసిన మోస్తరు వర్షాలకు గ్రామీణ రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయకపోవడంతో పాటు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో పాడైన రోడ్లపై ప్రజలు అవస్తలు పడుతున్నారు. దాంతో స్థానిక నాయకులే తాత్కాలిక మరమత్తులు చేయిస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు తిమ్మాపూర్ గ్రామంలోకి వెళ్లే రోడ్డు గుంతలు పడి, ప్రజలు పోయేందుకు అవస్తలు పడుతుండగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలు రాము సొంత ఖర్చులతో ట్రాక్టర్లతో మొరం పోయించాడు. దీంతో పలువురు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.