Run for Unity | ఓదెల, అక్టోబర్ 30: పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం ‘రన్ ఫర్ యూనిటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్ -2025’ను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కావున ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శుక్రవారం ఉదయం 6 గంటలకు ఓదెల జగదాంబ సెంటర్కు చేరుకోవాలని సూచించారు. అక్కడ ఈ కార్యక్రమం ప్రారంభమై ఒర్రెగడ్డ వరకు 2 కిలోమీటర్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలందరూ యువత, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది, అన్ని సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సై పిలుపునిచ్చారు.