Peddapally |పెద్దపల్లి రూరల్, జనవరి 15 : పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో గత 20 ఏళ్లుగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ను జాతర కమిటీ చైర్మన్, ఉపసర్పంచ్ ముత్యాల తిరుపతి ఆద్వర్యంలో సమీప గ్రామాల సర్పంచులు, జాతర కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 28 నుంచి 31 వరకు వన దేవతలుగా కొలుచుకునే సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ ముత్యాల తిరుపతి, సర్పంచ్ గోగు రాజన్న యాదవ్, నాయకులు ముత్యాల నరేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మల్లేశం, ప్రధానకార్యదర్శి శంకరయ్య, సహాయ కార్యదర్శి ముత్యాల జగన్, కోశాధికారి కనకట్ల స్వామి, కార్యవర్గ సభ్యులు నర్సయ్య, రాజేశం, వెంకటస్వామి, రాజయ్య, సత్యనారాయణ, శంకర్, దేవయ్య, సారయ్య, స్వామి, ఐలయ్య, భూమయ్య, తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.