Koya Sri Harsha | పెద్దపల్లి, నవంబర్15: 72వ అఖిల భారత సహకార వారోత్సవాల పోస్టర్ను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లోవిడుదల చేశారు.
సహకార సంస్థల ద్వారా ఆత్మ నిర్బర్ భారత్ అనే నినాదంతో సహకార వారోత్సవాలు ఈ నెల 14 -20 వరకు వారం రోజుల పాటు ఒక్కో అంశంతో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీ మాల, డీఎంవో పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.