Postal ballot | రామగుండంలో రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. రామగుండం కమిషనర్ జే అరుణశ్రీ
రామగుండం నగర పాలక సంస్థ ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉండి మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ నెల 7, 8 తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
Postal ballot | కోల్ సిటీ, ఫిబ్రవరి 6 : రామగుండం నగర పాలక సంస్థ ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉండి మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ నెల 7, 8 తేదీల్లో అవకాశం కల్పిస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఎన్టీపీసీ టీటీఎస్ లోని ఎంప్లాయి డెవలప్మెంట్ సెంటర్ మిలీనియం హాలులో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తులు సమర్పించడానికి, అలాగే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ రెండు రోజుల్లో ఉదయం 10.30 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు ఈ కేంద్రం పని చేస్తుందని, నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తు పూరించి ఓటరు గుర్తింపు కార్డు, ఎంప్లాయి గుర్తింపు కార్డు ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులు జత పరిచి సమర్పించాలనీ, ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడంలో భాగంగా ఈ హెల్ప్ లైన్ సేవలందిస్తుందనీ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా నిరంతరాయంగా పని చేస్తుందనీ, సమాచారం కోరేవారు సెల్ నం.9603666444, 9392483959, 18004257062లలో సంప్రదించి సేవలు పొందవచ్చని తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

