Poor quality | కోల్ సిటీ, జూన్ 29: రామగుండం నగర పాలక సంస్థ 9వ డివిజన్ జనగామ గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డు దుస్థితి ఇది. ఆ సిమెంట్ రోడ్డు నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగా చిరు వానకే రోడ్డంతా గుంతలమయమైంది. ఎక్కడికక్కడ వరద నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోంది.
రోడ్డుపై వర్షపు నీటి నిల్వతో దోమలు పెరిగి ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామగుండం నగర పాలక సంస్థ అధికారులు స్పందించి గుంతల రోడ్డుకు మరమ్మతులు చేపట్టి వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ డివిజన్ కు చెందిన సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్ డిమాండ్ చేశారు.