Poor maintenance | ముకరంపుర, జూలై 12: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఅర్ఎస్ ప్రభత్వ హయాంలో అప్పటి పాలక వర్గం రూ.12 లక్షల వ్యయంతో రైతు, ధాన్యం బస్తాలతో కూడిన ఎడ్ల బండి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. మార్కెట్ ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా పాత కార్యాలయం వద్ద ఆకట్టుకునేలా రైతు, ఎడ్ల బండి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
విగ్రహం వెనక వైపున ఉన్న రెయిలింగ్ గోడను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో కూలిపోయింది. స్టీల్ రెయిలింగ్ పూర్తిగా దెబ్బతిని కళావిహీనంగా మారింది. ఇప్పటికీ రెండు సీజన్లు గడిచినా అధికారులు విగ్రహానికి నిర్వహణ, మరమ్మతులు చేపట్టకుండా వదిలేయడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.