సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన నేపథ్యంలో వెంకటేశ్వర్లపల్లి గ్రామస్తులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరు కానున్నారు.
కాగా, గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి భూమి ఇస్తున్నాం కాబట్టి మాకు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాయిశెట్టి తిరుపతి, బత్తుల జైపాల్, గుర్రం కుమారస్వామిని అరెస్టు చేశారు. మండల కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించారు.