తిమ్మాపూర్, ఆగస్టు 19: పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయద్దని రామకృష్ణకాలనీలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒకసారిగా వందలాది మంది రోడ్డెకారు. రాజీవ్ రహదారిని దిగ్బంధించారు.
‘రేవంత్ రెడ్డి డౌన్.. డౌన్’ అంటూ నినదించారు. తమ జీవితాలను నాశనం చేయవద్దని వేడుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము ఉన్నత చదువులకు దూరం అవుతామని, ఉద్యోగాలూ దక్కకుండా పోతాయని వాపోయారు. ఎల్ఎండీ ఎస్ఐ అన్వర్ చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పినప్పటికీ ఆందోళన కొనసాగించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులను బలవంతంగా రోడ్డుపై నుంచి పకకు తొలగించారు.