కోర్టు చౌరస్తా, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ ఆదర్శప్రాయుడని బార్అసోసియేషన్ బాధ్యులు కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా సోమవారం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జూ పల్లి సత్యనారాయణరావు అధ్వర్యంలో అంబేదర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దేశానికి మార్గదర్శనం చేసిన గొప్పనేత అంబేద్కర్ అని చెప్పారు. అసోసియేషన్ కార్యదర్శి బీమా సాహెబ్, ప్రతిని ధులు మల్లేశ్, రఘువీర్, శ్రీకాంత్, తేజ్‌దీప్‌రెడ్డి, జీపీ వేణుగోపాల్ రావు, ఏపీపీలు గడ్డం లక్ష్మణ్, గౌరు రాజిరెడ్డి, మందల విక్రమ్‌రెడ్డి, జగన్, నగే శ్, స్వామి, ఆంజనేయులు, సతీశ్ పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ నివాళి..
రాంనగర్, డిసెంబర్ 6: అంబేదర్ వర్ధంతిని పురసరించుకొని సోమవారం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ కోర్టుచౌరస్తాలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్‌బాబు ఉన్నారు.
తెలంగాణచౌక్, డిసెంబర్ 6: బడుగు,బలహీన వర్గల అభ్యున్నతికోసం అంబేద్కర్ చేసిన సేవల ను పలు దళిత సంఘాల,ప్రజాసంఘల నా యకులు కొనియాడారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ వి గ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు గజ్జల ఆనందరావు, శంకర్, ప్రభాకర్, మనోహర్, అనిల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్ఎం శ్రీధర్ అంబేద్కర్ చి త్రపటానికి పూలమాల వేసి నివాళులరించారు. డీవీఎం రవిశంకర్‌రెడ్డి, డీఎంలు అర్పిత, మల్లేశం , సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి శనిగరపు రజనీకాంత్, నాయకులు అజయ్, అరవింద్, సురేశ్, లిఖిత, దివ్య ఉన్నారు.
డిస్ట్రిక్ డెవలప్మెంట్ కో-ఆర్డినేటర్ (దిశ) సభ్యు డు జానపట్ల స్వామి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.సీపీఐ జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ ఆధ్వ ర్యంలో సీపీఐ నాయకులు కోర్టు చౌ రస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివా ళులర్పించారు. నగర కార్యదర్శి సురేందర్‌రెడ్డి, బూడిద సదాశివ, శ్రీనివాస్ పాల్గొన్నారు.