Dharmaram | ధర్మారం,సెప్టెంబర్ 8 : అసెంబ్లీ ముట్టడి కోసం హైదరాబాద్ తరలి వెళ్లకుండా మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని పలు గ్రామాల ఉపసర్పంచ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప సర్పంచ్ చెక్ పవర్ ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడించాలని ఉప సర్పంచ్ ల ఫోరం పిలుపునిచ్చింది. దీంతో మండలంలోని రచ్చపల్లి, గోపాల్ రావు పేట, నర్సింహులపల్లి గ్రామాల ఉపసర్పంచ్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లకు ఉన్న జాయింట్ చెక్ పవర్ ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించడం సరైన కాదని అన్నారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపసర్పంచ్ ల చెక్ పవర్ రద్దు ప్రతిపాదనను విరమించుకోవాలని లేని పక్షంలో తామంతా ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.