Thimmapur | తిమ్మాపూర్,మార్చి28: ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకొని ఆదుపులోకి తీసుకొన్నారు. ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి బస్సులలో వెళ్తున్న ఆశా వర్కర్లను రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వారంతా రోడ్ పై నిలబడి ఆందోళన చెప్పట్టగా, ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకొని కరీంనగర్ పీటీసీ సెంటర్కి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏంటంటూ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు, ఆశాలకు స్వల్ప వాదన చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగడానికి వెళ్తే ప్రభుత్వానికి సమాధానం లేకుండా అడ్డుకుంటుందని ఆశాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.