Pochamma Bonalu | మారుతి నగర్, జులై 20 : ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని వివిధ వార్డులో గల పోచమ్మలకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతలైన ఐదు చేతులు, నల్ల, ముత్యాల పోచమ్మలకు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
పిల్లా, జెల్లా గోడ్డు, గోదాను చల్లంగా చూడాలి తల్లి అంటూ మొక్కులు తీర్చుకున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయా వార్డులోని పోచమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచి పోచమ్మ ఆలయాలకు భక్తులు ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.