Pochamma Bonala festival | కొడిమ్యాల, జూన్ 12 : కొడిమ్యాల మండల కేంద్రంలో తూర్పు, పడమటి వాడ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒక్క పొద్దులతో బోనాలను అందంగా అలంకరించి ఆలయాలకు తరలి వెళ్లారు. డప్పు చప్పుళ్లు, బైండ్లోళ్ల ఆటలతో ఉల్లే పోచమ్మ, ఇందూర్ పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాలకు బోనాల తీసుకెళ్లి నైవేధ్యం సమర్పించారు.
అనంతరం మొక్కులు చెల్లించారు. పిల్లా, జెల్లా, పాడి పంటలు సల్లంగుండాలని అమ్మవార్లను మొక్కులు చెల్లించుకున్నారు. ఈ బోనాల కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై అమ్మ వార్లకు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ నాయకులు తదితరులున్నారు.