తిమ్మాపూర్ రూరల్, 21: విద్యార్థులందరూ చెట్ల లాగే చదువులో రాణిస్తూ ఉన్నతులుగా ఎదగాలని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు ఆకాంక్షించారు. తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ప్లాంటేషన్ చేపట్టారు.
విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సాగర్‌రావు, కరస్పాండెంట్ సెక్రటరీ జువ్వాడి సు మిత్ సాయి కాలేజీ ఆవరణలో 1500 మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ ఫస్టియర్‌కు చెందిన ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించాలని ఉద్బోధించారు. కళాశాలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం, అధునాతన ప్ర యోగశాలలు, గ్రంథాలయం, అనుభవజ్ఞులై న బోధన సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు.
కళాశాల అమెరికాలోని లూ సియా నాటెక్ యూనివర్సిటీ, టీ హబ్‌తో ఒ ప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో విదేశా ల్లో చదవాలనుకునే విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రావు, డీన్ అకాడమిక్ డాక్టర్ పీకే వైశాలి పాల్గొన్నారు.