కరీంనగర్ కమాన్ చౌరస్తా, జనవరి 7: కరీంనగర్‌కు చెందిన బాషాబత్తిని ఓదెలు కుమార్‌కు ప్రయోగాత్మక బోధనకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ అంటే మక్కువ ఉన్న ఆయన, తన అభిరుచికి అనుగుణంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం చిగురుమామిడి జడ్పీ స్కూల్లో పనిచేస్తున్నారు. కఠినమైన ఫిజికల్ సైన్స్‌ను విద్యార్థులకు సులభంగా బోధించాలని సంకల్పించారు. అందుకు ప్రయోగాత్మక విధానాన్ని ఎంచుకొన్నారు.
వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన పరికరాలను రూపొందించి వినూత్నంగా బోధిస్తుండడంతో విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. ఈ విధానమే కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు తేగా, జాతీయస్థాయి సెమినార్లు, విజ్ఞాన ప్రదర్శనలకు ఎంపికై సత్తా చాటారు. ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్ట్‌కు సెలక్ట్ అయ్యారు. ప్రయోగత్మకంగా బోధిస్తూ నాలుగోసారి ఈ ఘనత సాధించారు. ఈ నెల 17 నుంచి 20 వతేదీ వరకు ఫరిదాబాద్‌లో నిర్వహించనున్న భారతదేశపు మెగా సైన్స్ ఫెస్టివల్ (క్యాంప్ ఆఫ్ ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్)లో పాల్గొననున్నారు. అంతర్జాతీయ, జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తల సెమినార్లుతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, పోటీలు, విజ్ఞానశాస్త్ర భాగస్వామ్య కార్యక్రమాలు, సాంకేతిక ప్రదర్శనల్లో పాలుపంచుకోనున్నారు. ఐఐఎస్‌ఎఫ్‌కు ఎంపికైన కుమార్‌ను తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.