కమాన్చౌరస్తా, ఏప్రిల్ 11 : శాతవాహన విశ్వవిద్యాలయ పీహెచ్డీ ప్రవేశ ఫలితాలను శుక్రవారం పరిపాలనా భవనంలో ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ నాలుగు ఫ్యాకల్టీ విభాగాలలో ఫలితాలను విడుదల చేశామని, దీంతో విశ్వవిద్యాలయంలో పరిశోధన కూడా మరింత ముందుకు వెళ్తుందని, ఇది విశ్వవిద్యాలయ అభివృద్ధికి చాలా అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేశ్ కుమార్, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య సుజాత, ఓఎస్డీ టూ వీసీ డాక్టర్ హరికాంత్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ అబ్రారూల్ బఖి, ఆచార్య వరప్రసాద్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.