CBCE | గోదావరిఖని :సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్య అందనుంది. సంస్థ సీఎండీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవ సత్ఫలితానిచ్చింది. రామగుండం-2 ఏరియాలో గల సింగరేణి హైస్కూల్ సెక్టర్-3 పాఠశాలలో సీ.బీ.ఎస్.ఈ బోధనకు అనుమతి వచ్చింది.
ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి ఆ పాఠశాలకు అప్లికేషన్ ను మంజూరు చేస్తూ ఏప్రిల్ 19న సర్టిఫికెట్ జారీ అయింది. సింగరేణి విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో ఏడాది క్రితం సంస్థ ఛైర్మన్ ఎన్ బలరాం సీబీఎస్ఈ ని సంప్రదించారు.
సింగరేణి పాఠశాలలు అన్ని రకాల సౌకర్యాలతో, ల్యాబ్ లు, క్రీడ మైదానాలు విశాలమైన తరగతి గదులు వంటి వసతులతో ఉన్నాయని, తగిన అర్హతలు గల బోధనా సిబ్బంది కూడా ఉన్నందువల్ల కార్మికుల పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనకు అనుమతించాలని కోరగా అనుమతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు .