చిగురుమామిడి : గ్రామాభివృద్ధికి ( Village Development ) ప్రజలు సహకరించాలని బీఆర్ఎస్ మండల నాయకుడు, సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి ( Sarpanch Kisan Reddy ) కోరారు. ఎన్నికల హామీలో భాగంగా మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం నూతన విద్యుత్ స్తంభాలను ( Electricity Poles ) ట్రాన్స్‌కో ఏఈ తో కలిసి ఏర్పాటు చేశారు. గ్రామంలో అవసరమైన ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. గ్రామంలో అంధకారం లేకుండా విద్యుత్ దీపాలను కొత్తగా ఏర్పాటు చేశామని వివరించారు.
ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ గ్రామస్థులను కోరారు. పార్టీలకతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నూతనంగా 70 స్తంభాలను ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్థులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈ ప్రకాష్, ఉపసర్పంచ్ గిట్ల తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి గాజుల శ్రీలక్ష్మి, లైన్మెన్ కనకయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు .