ఎల్లారెడ్డిపేట, మే, 9: మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్ ఇసుక రీచ్‌ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం నిరసన తెలిపారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారిపై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రాస్తారోకో చే శారు. ఎస్ఐ రమాకాంత్, ప్రొబెషనరీ ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారిని చెదరగొట్టారు. అనంతరం కొందరు ప్రతినిధులతోపాటు పలు పార్టీల నాయకులు తహసీల్దార్ సుజాతతో రీచ్‌ల సమస్యపై మాట్లాడారు.
ఒకే రీచ్‌కు అనుమతి ఇవ్వడం వల్ల ట్రిప్పునకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని రీచ్‌లకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా వారికి తహసీల్దార్ హామీ ఇచ్చారు. ఇకడ నాయకులు ఎస్కే గౌస్, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.