GP workers | వీణవంక, ఆగస్టు 24: పంచాయితీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి కొప్పుల శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ వర్కర్స్ యూనియన్ వీణవంక మండల ఐదో మహాసభ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొప్పుల శంకర్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలని, పీఎఫ్’ ఈఎస్ఐ సదుపాయం అందించాలని, ప్రమాదభీమా సదుపాయం రూ.15 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాలని అన్నారు.
డిమాండ్ల సాధన కోసం భవిష్యత్ పోరాటాల కోసం మండల స్థాయిలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ రానున్న రోజులలో మరో సమ్మె పోరాటానికి సన్నద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు మహంకాళి కొమురయ్య, కండె సదయ్య, దాసారపు వెంకటేశ్, కదం కిషన్‌రావు, దాసారపు శంకర్, అంబాల సదానందం, రాజయ్య, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.