కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 23 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే రేవంత్‌రెడ్డి సర్కారుపై మిలిటెంట్ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి, మాట్లాడారు. ఫీజు బకాయిల విడుదలపై ఆనాడు రేవంత్‌రెడ్డి చెప్పిందేంటి?, నేడు చేస్తున్న జాప్యం ఏంటి? అని ప్రశ్నించారు. విద్యాశాఖను కూడా తన వద్దే పెట్టుకున్న రేవంత్‌రెడ్డి ఆ శాఖకు నిధులు కేటాయించి విద్యార్థులకు ఖర్చు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు బకాయిలను ఈ నెల 27 లోగా విడుదల చేయకపోతే ‘చలో ఇందిరాపార్’ నిర్వహిస్తామని, వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ దిగ్బంధనం చేస్తామని, సచివాలయం ముట్టడిస్తామని స్పష్టం హెచ్చరించారు. ఇక్కడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామారపు వెంకటేశ్, మచ్చ రమేశ్, నాయకులు మామిడిపల్లి హేమంత్, కేశబోయిన రాము, కనకం సాగర్, లద్దునూరి విష్ణు, కసిరెడ్డి సందీప్‌రెడ్డి, కౌశిక్, ఛత్రపతి, వినయ్, శ్రావణ్, ఈశ్వర్, రిషి పాల్గొన్నారు.