Pegadapally | పెగడపల్లి: పెగడపల్లి తహసీల్దార్ గా ఆనందకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్ గా పని చేసిన రవీందర్ నాయక్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టై, సస్పెండైన విషయం తెలిసిందే. దీంతో మేడిపల్లి నాయబ్ తహసీల్దార్ ఆనంద్ కుమార్ కు పెగడపల్లి తహసీల్దార్ గా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ఆనంద్ కుమార్ శుక్రవారం బాధ్య తలు స్వీకరించారు. కాగా నాయబ్ తహసీల్దార్ లాస్యశ్రీ, సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఆర్ఐలు శ్రీనివాస్, జమున, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.