కోల్ సిటీ : గోదావరిఖనికి చెందిన ఈసారపు శివకుమార్ అనే యువకుడు 78వ సారి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. బుధవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసర పరిస్థితిలో ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా.. విషయం తెలుసుకున్న శివకుమార్ స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశాడు.
శివకుమార్‌ను జేసీఐ ప్రతినిధి లక్ష్మీనర్సయ్య, కేకే క్యాపిటల్ చైర్మన్ కోట కుమార్‌లు ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలని, అంతేగాక ఎన్నిసార్లు రక్తదానం చేస్తే అంత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు.