BC Azadi Federation | కాల్వ శ్రీరాంపూరర్. మే 28. బీసీలకు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా ను కల్పించాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ మేలు కోలుపు రథ యాత్ర బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరిగింది. జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్రలో బీసీ నేతలు పాల్గొని జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో వాటాను అందించాలని మేమెంతో మాకంత వాటా కల్పించాలని నినదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరియైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. బీసీ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ పెద్దపల్లి గడ్డపైబీసీల జెండా ఎగురవేస్తామని అన్నారు.
అనంతరం జక్కని సంజయ్ కు ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు బండ నిఖిల్, వడ్డేపల్లి మనోహర్, గుమ్మూల శ్రీనివాస్, జక్కని శ్రీకాంత్ స్థానిక కుల సంఘాల నాయకులు స్వామి వివేక్ పటేల్, కోరే కిరణ్, బండారి కోమురయ్య, మేర్గవేన సంపత్, కుమ్మరికుంట రవి కుమార్, శారద, గుంటుకు నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.