పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లత్నాపూర్లోని అర్జీ -3 ఓసీపీ – 2లో గని (OCP mine ) లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అర్జీ -3 ఓసీపీ -2లో హైవాల్ సంప్ దగ్గర మోటార్ రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ (Sidewall ) కూలింది. ఈ ప్రమాదంలో ఫిట్టర్ ఉప్పుల వెంకటేశ్వర్(Uppala Venkateshwar) , కార్మికుడు గాదం విద్యాసాగర్ అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఇద్దరు కార్మికులు శ్రీనివాస్‌రావు, సమ్మయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వారిని సీఎన్సీ డిస్పెన్షరికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కార్మికుల మృతదేహాలను జీడీకే సింగరేణి దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.