కాల్వ శ్రీరాంపూర్, జూలై 5: మల్యాల మోడల్ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులకు బాసరలోని ఐఐఐటీలో (Basara IIIT) ప్రవేశం లభించింది. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు చాలా పోటీ ఉన్నప్పటికీ తమ విద్యార్థులు ప్రతిభతో నిలబడ్డారని చెప్పారు. ఆర్.సహస్ర వర్షిణి, జీ.వేదప్రియ, దశరథ సీటు సాధించారన్నారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం పట్ల పాఠశాల, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గ్రామస్థులు గర్వపడుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ‘మా పాఠశాలలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కలగాలని, విద్యతో పాటు విలువలపై దృష్టి పెట్టే విద్యా విధానం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి’ అని చెప్పారు.