పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో చెన్నారావుపేట మండలం పాపన్నపేట గ్రామానికి చెందిన గాలి సందీప్(21) అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు, పోలీసులు చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.