Raaka | ఆ సీక్రెట్ తెలిసిపోయింది.. బన్నీ, అట్లీ ‘రాకా’ టీం గిన్నీస్ వరల్డ్ రికార్డ్
Raaka | సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న రాకా (Raaka) మూవీలో దీపికా పదుకొనే, రష్మిక మందన్నా, మృణాళ్ ఠాకూర్, జాన్వీకపూర్తోపాటు పలువురు కీలక నటీనటులు మెస్మరైజ్ చేయబోతున్నారు. మొత్తానికి విడుదలకు ముందే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాడు అట్లీ.
Raaka | ఐకాన్ స్టార్, అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం రాకా (Raaka). ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఆట్లీ టీం ’37’ నంబర్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నంబర్ వెనుకున్న సీక్రెట్ ఏంటనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేసి ప్రేక్షకులు, అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఇప్పుడు అట్లీ బర్త్ డే సందర్భంగా ఈ సీక్రెట్ ఏంటో క్లారిటీ ఇచ్చేశారు.
రియల్ టైం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి 37 మందిని చిత్రీకరించి.. విజువల్ ఎఫెక్ట్స్‌లో చేసిన ఒక కొత్త ప్రయోగానికి రాకా బృందం గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. గతంలో రియల్ టైంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి 19 మందిని చిత్రీకరించిన రికార్డు ఉండగా.. రాకా టీం తాజాగా 37మందితో ఆ రికార్డును అధిగమించింది. అల్లు అర్జున్, అట్లీ ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకుంది. భారతీయ సినిమా చరిత్రలో అరుదైన ఫీట్‌ను నమోదు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది అట్లీ అండ్ బన్నీ టీం.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకొనే, రష్మిక మందన్నా, మృణాళ్ ఠాకూర్, జాన్వీకపూర్తోపాటు పలువురు కీలక నటీనటులు మెస్మరైజ్ చేయబోతున్నారు. మొత్తానికి విడుదలకు ముందే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాడు అట్లీ. మరి ఈసినిమా బాక్సాఫీస్ రికార్డు ఏ స్థాయిలో బద్దలు కొడుతుందనేది చూడాలి.
HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage! 🌎#Raaka sets a Guinness World Record for the “Most People Motion-Captured in Real-Time”, with 37 performers captured simultaneously!
Mr. Allu Arjun and Mr. Atlee received the Guinness World Records… pic.twitter.com/qWqRKjZuAx— BA Raju’s Team (@baraju_SuperHit) September 21, 2026
Read Also :
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

