Bilibili | చైనా వీడియో షేరింగ్ యాప్ బిలిబిలి వైపు భారత కంటెంట్ క్రియేటర్ల మొగ్గు..!
Bilibili | భారతీయ కంటెంట్ క్రియేటర్లు (Indian Content Creaters) ఇప్పుడు చైనా (China) కు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ (Video sharing App) 'బిలిబిలి (Bilibili)' వైపు మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్ (Youtube) వంటి అంతర్జాతీయ వేదికలు తమ నిబంధనలను, మానిటైజేషన్ (Monitisation) విధానాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో క్రియేటర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
Bilibili : భారతీయ కంటెంట్ క్రియేటర్లు (Indian Content Creaters) ఇప్పుడు చైనా (China) కు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ (Video sharing App) ‘బిలిబిలి (Bilibili)’ వైపు మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్ (Youtube) వంటి అంతర్జాతీయ వేదికలు తమ నిబంధనలను, మానిటైజేషన్ (Monitisation) విధానాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో క్రియేటర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
భారత్‌లో ఈ యాప్ ఇంకా అధికారికంగా అందుబాటులోకి రాకపోయినప్పటికీ పలువురు క్రియేటర్లు అప్పుడే ఇందులో తమ కంటెంట్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. ‘చైనా యూట్యూబ్’ గా గుర్తింపు పొందిన బిలిబిలి 2009లో ప్రారంభమైంది. తొలుత యానిమేషన్, కామిక్స్, గేమింగ్ కంటెంట్‌కు మాత్రమే పరిమితమైన ఈ వేదిక.. కాలక్రమేన టెక్నాలజీ, వినోదం, లైఫ్‌స్టైల్, నాలెడ్జ్ ఆధారిత వీడియోలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
2025 మూడో త్రైమాసికం గణాంకాల ప్రకారం.. ఈ ప్లాట్‌ఫామ్‌కు 376 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉండగా సగటున ప్రతి వినియోగదారు రోజుకు 112 నిమిషాల సమయాన్ని ఈ యాప్‌లో గడుపుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో బిలిబిలి అధికారికంగా అందుబాటులో లేదు. దాంతో క్రియేటర్లు వీపీఎన్ (వీపీఎన్), ఏపీకే (ఏపీకే) ఫైల్స్, ఫోన్ లొకేషన్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయడం వంటి పద్ధతుల ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేస్తున్నారు.
ఝార్ఖండ్‌కు చెందిన ట్రావెల్ వ్లాగర్ నవనీత్ కుమార్ తివారీ ఇటీవల బిలిబిలిలో తన వీడియోలను పోస్ట్ చేయగా కేవలం 15 రోజుల్లోనే ఆశించిన స్థాయిలో వ్యూస్, ఎంగేజ్మెంట్ లభించినట్లు సమాచారం. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా గేమింగ్, టెక్నాలజీ, ట్రావెల్ విభాగాల్లోని కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తుందని క్రియేటర్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఇండోనేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో బిలిబిలి ఇప్పటికే విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో భారత్-చైనా సంబంధాల నేపథ్యంలో టిక్‌టాక్‌ను నిషేధించారు. ఈ క్రమంలో బిలిబిలి భవిష్యత్తులో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశిస్తుందో లేదో వేచి చూడాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

